దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆప్ కేంద్ర కార్యాలయాన్ని మూసేశామని, ఆఫీస్ వద్దకు ఎవరూ రావొద్దని ఆప్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.