బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రత్‌తో కలిసి మకావ్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ కామెడీ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఫోజులిచ్చారు. ఈ వేడుకలో చైనా నటులు షెన్ టెంగ్, మా లీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో పెళ్లి చేసుకున్న ఆమిర్.. వారితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.