BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే AAP ఓటమి: TPCC చీఫ్
By Shashi kumar 73చూసినవారుBRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే AAP ఓడిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం, బీజేపీ నెత్తిన పాలు పోసిందన్నారు. కేజ్రీవాల్ పతనానికి కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు పునాదులు వేశాయని అన్నారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని.. కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందని విమర్శించారు.