పోలీస్ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు

78చూసినవారు
పోలీస్ గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు
AP: విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ఏబీ వెంకటేశ్వరరావు పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి గతేడాది మే 31న పదవీ విరమణ చేశారు.

సంబంధిత పోస్ట్