స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. 18మందికి గాయాలు?

50చూసినవారు
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం.. 18మందికి గాయాలు?
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ స్టీల్‌ప్లాంట్‌లో బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్