తెలంగాణలో విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా SBIతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జరిగింది. ఒక్కో ఉద్యోగికి రూ.1 కోటి విలువైన బీమా కల్పించడంతో, వారి ధైర్యం, నమ్మకం మరింత పెరుగుతుందని భట్టి అన్నారు. అలాగే, డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని ఉద్యోగులకు సూచించారు.