తాను నటిస్తోన్న ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో జరిగిన ప్రమాదంపై హీరో నిఖిల్ స్పందించారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు కొన్నిసార్లు రిస్క్‌లు తప్పవు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, మా సిబ్బంది తీసుకున్న జాగ్రత్తల కారణంగా మేం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ, ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’ అని తెలిపారు.