గుజరాత్‌లోని వడోదరలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వడోదర హైవేపై ఎల్ అండ్ టీ నాలెడ్జ్ సిటీ సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా ప్రమాదం జరగడంతో మందు బాటిళ్ల కోసం జనం ఎగబడ్డారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పట్టించుకోకుండా మందు బాటిళ్లను తీసుకెళ్లారు. చివరికి పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.