బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుడు అరెస్టు

84చూసినవారు
బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుడు అరెస్టు
మాజీ మంత్రి, NCP సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్టయ్యాడు. ముంబయి పోలీసులు ఈ విషయాన్ని ప్రకటించారు. విచారణలో ఇతర నిందితుల ద్వారా జీషాన్ పేరు బయటపడింది. హత్యకు ప్రణాళిక రూపొందించిన తర్వాత నకిలీ పాస్‌పోర్టుతో దేశం విడిచి పారిపోయిన అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం జీషాన్‌ను భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్