TG: ఎంతటి వారైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ములుగులో మంత్రి పొంగులేటి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కాళేశ్వరం, ధరణి, మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని పొంగులేటి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని ఆరోపించారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందుకు విచారణకు వచ్చారని మంత్రి తెలిపారు.