TG: కామెడీ పేరుతో తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగిస్తే యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ బస్సు కండక్టర్‌ను ఓ యువకుడు గుంటూరు వెళ్తుందా? అని అడిగి, ఆపై ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పును చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఈ వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు.