ప్రముఖ ఫ్రెంచ్ నటుడు గెరార్డ్ డెపార్డీయు (76) లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు. 2021లో సినిమా సెట్‌లో ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. మొదట తనపై ఉన్న ఆరోపణలను ఖండించిన ఆయన, విచారణలో మాత్రం తప్పు తేలింది. ఫలితంగా కోర్టు ఆయనకు 18 నెలల శిక్ష విధించింది. అలాగే జాతీయ లైంగిక నేరస్థుల జాబితాలో ఆయన పేరును చేర్చాలని కూడా ఆదేశించింది.