మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టనున్నారు. రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ ఒక సమావేశం లో వెల్లడించారు. అమెరికాలో సినిమా చిత్రీకరణ ముగించుకుని తిరిగొచ్చాక జులైలో ఆ బాధ్యతలు చేపడతారని ఆయన స్పష్టం చేశారు.