యువతిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు రోషన్ ఉల్లాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని త్రిస్సూర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోషన్ ఉల్లాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించింది. కాగా, రోషన్.. నాయికా నాయకన్, ఒట్టాన్ తదితర సినిమాల్లో నటించారు.