సినీ నటి అభినయ పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపారు. కాబోయే భర్తతో గుడి గంట కొడుతున్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమెకు కాబోయే భర్త ముఖాన్ని మాత్రం చూపించలేదు. 'చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్షిప్ లో ఉన్నాను. మాది 15 ఏళ్ల బంధం' అని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దివ్యాంగురాలైన (మూగ, చెవిటి) అభినయ తెలుగులో శంభో శివ శంభో, ఢమరుకం, దమ్ము, SVSC వంటి మూవీల్లో నటించారు.