ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. 'అతడి వేధింపులపై గతంలో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాను. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడైనా ఈ విషయంపై త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలి' అని ట్వీట్ చేసింది. పూనమ్ ఫిర్యాదు చేసేంతలా త్రివిక్రమ్ ఏం చేశారనేది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.