బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మూడోసారి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. పాకిస్థాన్ నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహమాడనున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా జీవితంలో సరైన వ్యక్తి ఇన్నాళ్లకు దొరికాడు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మేం పెళ్లి చేసుకోబోతున్నాం’ అని పోస్ట్ పెట్టారు. కాగా, రాఖీ సావంత్ గతంలో రితేష్ సింగ్, ఆదిల్ ఖాన్ దురానీని పెళ్లాడి విడాకులు తీసుకున్నారు.