గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో కీలక ముందడుగు పడింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ భారత్‌లోనే తొలి ఆఫ్‌గ్రిడ్ 5 మోగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్‌ను గుజరాత్‌లోని కచ్‌లో ప్రారంభించింది ఈ మేరకు కంపెనీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించుకుని నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా విభజించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ముఖ్య ఉద్దేశం.