గౌతమ్ అదానీ దేశం పరువు, జగన్ ఏపీ పరువు తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. హైదరాబాద్లో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ, మరికొందరిపై అభియోగాలు మోపాయి. గౌతమ్ అదానీ ఏపీ ఉన్నతాధికారికి రూ.1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం లంచం జగన్కు ఇచ్చినట్లు స్పష్టంగా వెల్లడైంది’’ అని షర్మిల చెప్పారు.