అదానీని అరెస్ట్ చెయ్యాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై Dy.CM భట్టి విక్రమార్క స్పందించారు. అదానీ లాంటి వారికి మోదీ దేశ సంపద దోచి పెడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. దేశ సంపదని తాము నిర్మిస్తే మోదీ అమ్ముతున్నాడా? లేదా? సమాధానం చెప్పాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి అదానీ వస్తే తాము ఆయనకు రాష్ట్రాన్ని అప్పగించలేదన్నారు. రాహుల్ గాంధీ మాటకు సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందని తెలిపారు.