చేపలు పట్టడానికి వెళ్లి నీటిలో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం కుబీర్ మండలం రంగశివునికి చెందిన జాదవ్ అరవింద్ (25) భైంసా మండలం బిజ్జూరు గ్రామ శివారులోని మత్తడి వాగులో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.