ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యుల పోస్టుల భర్తీకి బుధవారం జరిగిన ఇంటర్వ్యూకు 31 మంది హాజరయ్యారు. ఎంబీబీఎస్ విభాగంలో 16 పోస్టులకు 18 మంది హాజరయ్యారు. అసిస్టెంట్, అసోసియేట్, ఇతర పోస్టులకు 13 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, అర్హులైన అభ్యర్థుల జాబితాను తయారు చేసి కలెక్టర్ కు నివేదిస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన తర్వాత నియామక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.