రెండు గ్రూపుల యువకుల మధ్య గొడవ

58చూసినవారు
ఆదిలాబాద్‌లోని రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపులుగా మారి యువకులు కొట్టుకున్నారు. డీజే విషయంలో యువకుల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. రైల్వే స్టేషన్ ఆవరణలో చొక్కాలు చిరిగేలా యువకులు కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ కరుణాకర్ ఘటన స్థలానికి చేరుకొని తన సిబ్బందితో కలిసి ఆకతాయిలను చెదరగొట్టారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్