రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి

76చూసినవారు
రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోట్టకూటి కోసం మహారాష్ట్రలోని కిన్వట్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీకాకుళం వాసి బాలకృష్ణ ఆదిలాబాద్ రూరల్ మండలం చందా (టి) గ్రామంలో ఉన్న తమకు తెలిసిన వారి ఇంటికి వెళ్ళాడు. ఐతే తిరిగి ఆదివారం కిన్వట్ కు ద్విచక్ర వాహనంపై బయలుదేరగా, చందా బైపాస్ వద్ద బోర్డ్ కు ఢీకొని కిందపడటంతో తలకు తీవ్ర గాయలై మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్