ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రంజాన్ పండగ పూట కత్తిపోట్లు కలకలం రేపింది. ఆదిలాబాద్ లోని ఓల్డ్ బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఒకే వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కాస్త కత్తిపోట్లకు దారితీసింది. తీవ్ర గాయాలైన వారిని వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.