పారిశుధ్య పనులను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి

79చూసినవారు
పారిశుధ్య పనులను పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. ఈ పనులను మున్సిపల్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు ఆయా వార్డుల్లో శనివారం పర్యటించి పనులను పర్యవేక్షించారు. దస్నాపూర్, అశోక్ రోడ్, బ్రాహ్మణవాడ తదితర కాలనీలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టారు. మురికి కాల్వలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ వాడు కౌన్సిలర్ రాజేష్ తదితరులు ఉన్నారు.