వ్యవసాయ కూలీలకు కూలిబందు అమలు చేయాలని, విధి విధానాలు ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 6న జరిగే ఛలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య భవనంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షులు స్వామీ, ఆశన్న, కిష్టన్న, సురేందర్ ఉన్నారు.