ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు ఏరియర్స్ చెల్లించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముత్యం రెడ్డి ను తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నాయకులు సిర్ర దేవేందర్ కోరారు. ఈ విషయమై బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టర్ కార్మికుల శ్రమ దోపిడీ చేసి వెళ్లిపోయారని వివరించారు.