తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. బుదవారం ఆదిలాబాద్ లోని విద్యా సంస్థలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించగా. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరయ్యారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. విద్యార్థుల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.