నేరడిగొండ ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు DMHO

54చూసినవారు
నేరడిగొండ ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు DMHO
నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా అదనపు వైద్యాధికారి డా. మనోహర్ తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న మందులు, వైద్యుల రికార్డులను పరిశీలించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ పవార్ రవీందర్, ఆరోగ్య పర్యవేక్షకుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్