రామడుగు మండల కేంద్రంలోని నూతన వంతెన పై వెళ్తున్న కారు అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం కరీంనగర్ నుండి రామడుగు వైపు టీఎస్ 01 ఈ ఆర్ 6114 అనే ఎర్టిగా కారు నూతన బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. కాగా అందులో నలుగురు ప్రయాణికులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.