బైక్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగిన ఘటన గురువారం రాత్రి ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే పట్టణంలోని క్రాంతి నగర్ కు చెందిన షేక్ వాజిద్ ద్విచక్ర వాహనం స్టాండ్ విరిగిపోవడంతో వెల్డింగ్ చేయించడానికి స్ధానిక భూక్తాపూర్ లోని వెల్డింగ్ షాప్ తీసుకెళ్లాడు. వెల్డింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ పెట్రోల్ పైపు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన వాజిద్ నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు.