ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడ, తండాల్లో గురువారం సాయంత్రం సుమారు 8 గంటలకు జరిగే కామదహనం నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంగా రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జరుగుతున్నా ఈ వేడుకలలో కొబ్బరి, నైవేద్యాలతో కూడిన పదార్థాలతో సంబరాలు జరుపుకోనున్నారు. వాటిని రెండు వెదురుతో మంటల్లో పెట్టి ఎవరు ముందు పడిపోకుండా గెలుస్తారో దానిపై పోటీ నిర్వహిస్తారు.