ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్మల్ జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి తెలిపారు. 8 నుంచి 9 ఏళ్ల వారు అర్హులని చెప్పారు. ఈ నెల 16-19 వరకు మండల, 25న జిల్లాస్థాయి, జూలై 1-5 తేదీల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 7013396536 నంబరు కాల్ చేయాలని సూచించారు.