ఆదిలాబాద్: కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి

84చూసినవారు
ఆదిలాబాద్: కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి
భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌ లోని సంఘం కార్యాలయంలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కార్మిక లోకం మొత్తం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని పేర్కొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్