కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆశన్న డిమాండ్ చేశారు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బుదవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మికులతో కలిసి దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ప్రభుత్వాలు కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు