ఉమ్మడి జిల్లాలో డిగ్రీ పాసైన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. అభ్యర్థులు www. tgbcstudycircle. cgg. gov. inలో అప్లై చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 08732 221280 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.