ఆదిలాబాద్: జాతీయస్థాయిలో క్రీడాకారులు రాణించాలి

74చూసినవారు
ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్ మంగళవారం సాయంత్రం ముగిసింది. టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. నిజామాబాద్, నల్గొండ రెండు, మూడవ స్థానాలను సాధించాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. రాష్ట్ర క్రీడాకారులు జాతి స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్