విత్తనాలు కొనేటప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని, రసీదు సంబంధిత రైతు పేరుతోనే ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్త శివ చరణ్ తెలిపారు. గురువారం బేల మండలం చెప్రాల లో అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం యాజమాన్య పద్ధతులలో వ్యవసాయం చేసి తక్కువ ఖర్చులతో లాభాలు పొందాలని అన్నారు. ఈ మేరకు రైతులకు పంటల యాజమాన్య పద్ధతులపైనా అవగాహన కల్పించారు