ఆన్‌లైన్ జీరో పర్మిట్ సిస్టమ్‌పై అవగాహన సమావేశం శనివారం కలెక్టరేట్‌లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సంబంధిత కార్యనిర్వాహక శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ జీరో పర్మిట్ సిస్టమ్‌ని జిల్లాలో అమలు పరచాలని ఆదేశించారు. గనులు, భుగర్భశాఖ, సహాయ సంచాలకులు, కార్యనిర్వాహక శాఖ ఆధికారులు, కాంట్రాక్టర్లకు ఆన్‌లైన్ జీరో పర్మిట్ సిస్టమ్‌పై అవగాహన కల్పించారు.