ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం సఖి కేంద్రం, మహిళ సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా అతీక్ బేగం అధ్యక్షత వహించారు. సైకో సోషల్ సఖీ కౌన్సిలర్ లావణ్య మహిళల చట్టాలపై అవగాహనా కల్పించగా, లీగల్ కౌన్సిలర్ సంఘమిత్ర విద్యార్థులకు సమాజంలో జరిగే సైబర్ నేరాల గురించి తెలియజేశారు.