సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ డీఎస్పీ హసీబుల్లా సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఆదిలాబాద్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో సైబర్ క్రైమ్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలలో సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడానికి ర్యాలీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనుమానిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐ సునీల్ కుమార్, షీటీం ఇబ్బంది తదితరులు ఉన్నారు