ఆదిలాబాద్: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం

62చూసినవారు
ఆదిలాబాద్: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
సిరికొండలోని నేరెడిగొండ (జి) మూలమలుపు వద్ద బొలెరో బోల్తా పడి గాయపడ్డ క్షతగాత్రులు ఆదిలాబాద్ లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. గాయపడ్డ వారిలో పలువురు కోలుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్