రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు పేర్కొన్నారు. నాయకులు జహీర్ రంజాని, ముజ్జు, సతీష్, షకీల్ తదితరులున్నారు