ఆదిలాబాద్: పంజా విసురుతున్న చలి

81చూసినవారు
ఆదిలాబాద్: పంజా విసురుతున్న చలి
చలిపులి పంజా విసురుతోంది..రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. సంక్రాంతికి ముందు చలి ఎక్కువగా ఉంటుందనే మాటలకు అద్దం పట్టేలా చలి తీవ్రత అధికంగా మారింది. ముఖ్యంగా చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

సంబంధిత పోస్ట్