ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని బీజేపి ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని అన్నారు. టెక్స్ టైల్ పార్క్, విమానశ్రయం ఏర్పాటు చేయాలన్నారు