
నేడు విమాన బాధితులను పరామర్శించనున్న మోదీ
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్‌కి బయలుదేరనున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆయన అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో పరామర్శించనున్నారు. అనంతరం విమానం కూలిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. ప్రధానితో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఆయనతో కలిసి వెళ్తారని సమాచారం.