ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీ ఎదుట అభ్యర్థులు శనివారం నిరసన తెలిపారు. ఎలాంటి ముందు సమాచారం లేకుండా లైబ్రరీని మూసి వేయడాన్ని వారు ఖండించారు. పోటీ పరీక్షల నేపథ్యంలో లైబ్రరీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించినప్పటికీ అధికారులు దాన్ని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుంచి లైబ్రరీకి చదవడానికి వస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు.