ఆదిలాబాద్: ఆహార భద్రతా కమిటీతో కలెక్టర్ సమావేశం

68చూసినవారు
ఆదిలాబాద్: ఆహార భద్రతా కమిటీతో కలెక్టర్ సమావేశం
జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల, కళాశాల, హాస్టల్, రెసిడెన్షియల్, ఆసుపత్రిని సందర్శించాలని బుధవారం కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఆహార భద్రతా కమిటీతో ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి వారం తప్పకుండా తనిఖీ నివేదికను సమర్పించాలని అధికారులను సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్