అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆదిలాబాద్ కలెక్టర్

56చూసినవారు
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని సాంఘిక సంక్షేమ కార్యాలయంలో ఆయన చిత్రపటంతో పాటు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంచశీల జెండాను ఆవిష్కరించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్